నిరుద్యోగులకు పవన్ గుడ్‌న్యూస్! ప్రతి మూడు నెలలకు ఒకసారి - వారికి సేఫ్టీ కిట్లు పంపిణీ!
Mon Jun 09, 2025 13:52 Politics
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గ యువతకు శుభవార్త తెలిపారు. పిఠాపురంలో ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పిఠాపురానికి చెందిన 325 మంది ప్రైవేటు ఎలక్ట్రీషియన్లతో నిన్న ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి సేఫ్టీ కిట్లు పంపిణీ చేశారు. విద్యుత్ పనులు చేసే సమయంలో ఎలక్ట్రీషియన్లు తప్పనిసరిగా రక్షణ పరికరాలు వాడాలని సూచించారు. మల్లం గ్రామంలో దళిత సామాజికవర్గానికి చెందిన పల్లపు సురేశ్ అనే ఎలక్ట్రీషియన్ విద్యుదాఘాతానికి గురై మృతి చెందడం తనను కలచివేసిందన్నారు. ఈ ఘటన గ్రామంలో స్పర్థలకు దారితీసిందని, రాజకీయ లబ్ధి కోసం ఆలోచించేవారు ఇలాంటి గొడవలను పెద్దవి చేస్తారన్నారు. తాము మాత్రం సమస్యలను ఎలా పరిష్కరించాలో ఆలోచిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని దారి మళ్లించారని విమర్శించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా అమలు చేసే కార్యక్రమాలను పునరుద్ధరిస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్‌మోహన్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: ఆ జాతీయ రహదారికి గ్రీన్ సిగ్నల్! ఆరు మండలాల్లో 20 గ్రామాలలో భూసేకరణ! భూముల ధరలకు రెక్కలు!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఆ మాజీ మంత్రిపై మరో కేసు నమోదు! వైసీపీలో హైటెన్షన్..
కాంగ్రెస్ మంత్రివర్గ విస్తరణ - కొత్త మంత్రులు వీరేనా? ఆ వర్గాల వారికే..
సీనియర్ నేత రాజీనామా.. టీడీపీకి గుడ్ బై చెప్పిన రాయలసీమ ముఖ్యనేత!
పార్టీలో చేరికలపై నేతలకు కీలక ఆదేశాలు జారీ! కేంద్ర కార్యాలయానికి..
జగన్ పెంచి పోషించిన మత్తు భూతం రాష్ట్రాన్ని వదల్లేదు! తిరుపతిలో స్థానికులు ఆగ్రహం వ్యక్తం!
ఆ 8 జిల్లాలతో పాటు విశాఖ ఆర్థిక ప్రాంతం.. లక్ష ఎకరాల్లో ప్రాజెక్టులు.. అదిరిపోయే బాబు ప్లాన్!
అదిరిపోయే శుభవార్త: ఏపీలో భారీగా నిల్వలు.. తవ్వుతుంటే కిలోలకి కిలోలే బయటికి వస్తుంది!
ఏపీ మహిళలకు శుభవార్త! ఒక్కొక్కరికి రూ.లక్ష ఇస్తారు, దరఖాస్తు చేసుకోండి!
షుగర్ అని భయపడుతున్నారా.. అయితే దీన్ని తీసుకోవడం వల్ల ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు!
రెడ్ అలర్ట్! ఆ జిల్లాల్లో కుండ పోత వర్షాలు! ప్రజలు బయటకు రావద్దు!
గుడ్ న్యూస్.. మరో రెండు నెలల్లో భారీగా తగ్గనున్న బంగారం ధరలు! 12 - 15% తగ్గే అవకాశం!
బంపర్ ఆఫర్.. దుబాయ్ లాటరీలో విమాన టిక్కెట్లు, ఫోన్లు గెలుచుకోండి ఇలా! ఈ అవకాశం పోతే మళ్ళీ రాదు..
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #Pawankalyan #AndhraPradesh #Pithapuram #Job Mela #Andhra Pradesh #Electricians Safety Kits #Mangalagiri #Private Jobs #Construction #Workers Welfare #Kakinada
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.